ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసాన్ని పెంపొందించడమే ఏకైక లక్ష్యం.. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి , ఆగస్టు 11(చక్రవాణి న్యూస్ :
భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ వార్షిక తనిఖీల్లో భాగంగా కోయూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీకి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం 'వన మహోత్సవం' లో భాగంగా స్టేషన్ ఆవరణలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు.స్టేషన్‌లో నమోదైన పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించిన ఎస్పీ , కేసుల దర్యాప్తును వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ రికార్డులను అప్‌డేట్ చేయాలన్నారు. రోడ్డు ప్రమాద కేసులకు సంబంధించిన వాహనాల స్థితిగతులు, వాటి పరిష్కార పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రౌడీ షీటర్లపై తీసుకుంటున్న చర్యలను సమీక్షిస్తూ, వారిపై నిరంతరం నిఘా కొనసాగించాలని ఆదేశించారు.రిసెప్షన్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడిన ఎస్పీ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. అందిన ఫిర్యాదులను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నిస్పాక్షికంగా, పారదర్శకంగా సేవలు అందించాలని, తద్వారా ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసాన్ని మరింత పెంపొందించడమే లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, కాటారం సీఐ నాగార్జున రావు, కొయ్యూరు ఎస్సై మహేందర్ కుమార్ ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:





0 Comments