అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం... కాటారంలో కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
భూపాలపల్లి , ఆగస్టు 10 (చక్రవాణి న్యూస్) :
భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. కాటారం, మహాదేవ్‌పూర్, మల్హర్ రావు, పలిమెల మండలాలకు చెందిన లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో చెక్కులను అందుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఆడపిల్లల వివాహం తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. అలాగే, అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించి ఆదుకుంటున్నామని పేర్కొన్నారు.ప్రజా సంక్షేమమే ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు.. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని చెప్పారు. పథకాల ద్వారా అందుతున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాపు, ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు రమేష్, తాడిచర్ల ఫాక్స్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మల్హర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు కొండ రాజమ్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:


0 Comments