కొయ్యూరు సర్పంచ్ కొండ రాజమ్మ ఆధ్వర్యంలో
మల్హర్ , ఆగస్టు 03 (చక్రవాణి న్యూస్) :
మండలంలోని కొయ్యూరు గ్రామపంచాయతీలో సోమవారం సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు, స్థానిక సర్పంచ్ కొండ రాజమ్మ అధ్యక్షతన ఘనంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆశీస్సులతో గ్రామానికి మంజూరైన 8 ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గతంలో తలెత్తిన సాంకేతిక సమస్యలు పరిష్కారం కావడంతో.. మిగిలిపోయిన ఇళ్లకు సంబంధించిన ఉత్తర్వులను కూడా సర్పంచ్ కొండ రాజమ్మ, ఉపసర్పంచ్ లకవత్ సావేందర్, పంచాయతీ కార్యదర్శి పంచగిరి రాజులు కలిసి లబ్ధిదారులు లకవత్ శ్రీలత, తస్లీమా కు అందజేశారు.ఈ గ్రామసభలో వార్డు సభ్యులు ఎడ్ల మధుసూదన్, వేల్పుల సరమ్మ, లకవత్ లక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ బుర్రి లక్ష్మీనారాయణతో పాటు పంచాయతీ సిబ్బంది, మహిళలు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:


0 Comments