తాడిచర్ల ఓసీపీ బాధితులకు న్యాయం చేయాలి


ఆర్‌డీఓకు సర్పంచ్‌ బండి స్వామి వినతి

మల్హర్ , ఆగస్టు 04 (చక్రవాణి న్యూస్) : తాడిచర్ల జెన్కో ఓపెన్‌ కాస్ట్‌-1 గని డేంజర్ జోన్ పరిధిలో ఇళ్లను కోల్పోతున్న స్థానిక కుటుంబాలకు సమగ్ర విచారణ ద్వారా పూర్తిస్థాయి న్యాయం, పునరావాసం కల్పించాలని తాడిచర్ల సర్పంచ్‌ బండి స్వామి కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన కాటారం ఆర్‌డీఓకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఓసిపి తవ్వకాల వల్ల తరతరాలుగా నివసిస్తున్న అనేక కుటుంబాలు నేడు ఇళ్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్న సాంకేతిక, సామాజిక సమస్యల వల్ల అర్హులైన స్థానికులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, అధికారులు ప్రత్యేక విచారణ జరిపి నిర్వాసితులందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ రికార్డుల్లో నమోదు లేని ఇళ్లకు, వంశపారంపర్యంగా నివసిస్తున్న కుటుంబాలకు ఎలాంటి ఆస్తి నష్టం కలగకుండా పూర్తి పరిహారం అందించాలన్నారు. స్థానికంగా ఉండే ఒంటరి మహిళలు, వితంతువులకు మానవీయ కోణంలో ప్రాధాన్యతనివ్వాలని కోరారు. బతుకుదెరువు కోసం తాత్కాలికంగా వలస వెళ్లిన వారిని కూడా స్థానికులుగానే పరిగణించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

Post a Comment

0 Comments