రైతన్నల ‘బురద’ కష్టాలు:

తాడిచర్ల కరుకల్ల రోడ్డుపై నరకయాతన!

మల్హర్ , ఆగస్టు 04(చక్రవాణి న్యూస్) : మల్హర్ మండల కేంద్రమైన తాడిచర్ల కాపురం శివారు కరుకల్ల రోడ్డు దుస్థితి రోజురోజుకూ అధ్వాన్నంగా మారుతోంది. నిత్యం వందలాది మంది రైతులు, పశువుల కాపరులు వ్యవసాయ పొలాలకు వెళ్లే ఈ దారి.. ప్రస్తుత వర్షాలకు పూర్తిగా బురదమయమైంది. లోతైన గుంతల వల్ల కనీసం నడవడానికి కూడా వీల్లేకుండా పోయింది. ఏళ్లు గడుస్తున్నా ఈ రోడ్డును పట్టించుకునే నాథుడే లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని తాడిచర్ల గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

Post a Comment

0 Comments