పామునూరు బేస్ క్యాంపులో పోలీస్ జెండా ఎగురవేసిన రాష్ట్ర పోలీస్ బాస్
వరంగల్ , ఆగస్టు 10 (చక్రవాణి న్యూస్) :
దాదాపు 50-60 ఏళ్లుగా మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతంగా ఉన్న కరెగుట్టలలో ఇకపై పూర్తి ప్రశాంత వాతావరణం నెలకొందని రాష్ట్ర డీజీపీ సివీ ఆనంద్ ప్రకటించారు. ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని పామునూరు సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంపును సందర్శించిన ఆయన, అక్కడ పోలీస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం శాంతికి ప్రతీకగా తెల్లటి పావురాలను గాల్లోకి ఎగురవేశారు.
పామునూరు బేస్ క్యాంపు నుంచి ఛత్తీస్‌గఢ్ సరిహద్దు వరకు సాగుతున్న రహదారి నిర్మాణ పనులను, వాటి నాణ్యతా ప్రమాణాలను డీజీపీ సివీ ఆనంద్ స్వయంగా పరిశీలించారు. ఈ రోడ్డు మార్గం పూర్తయితే భవిష్యత్తులో ప్రజల రవాణాకు అనుకూలంగా ఉండటంతో పాటు, ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పామునూరు పరిసర గ్రామాల్లో నివసిస్తున్న ఆదివాసీలకు పోలీస్ శాఖ తరఫున నిత్యావసర వస్తువులు, దుస్తులు, పండ్లను డీజీపీ పంపిణీ చేశారు. గిరిజన గ్రామ ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఇంకా ఎవరైనా మావోయిస్టు కార్యకలాపాల్లో కొనసాగుతుంటే, తక్షణమే పోలీసుల ఎదుట లొంగిపోవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున పునరావాసం మరియు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ, ఐజీ, ములుగు జిల్లా ఎస్పీ శబరీష్, అటవీ శాఖ ఉన్నతాధికారులు మరియు సీఆర్‌పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి





0 Comments