ఖర్గే పర్యటించిన ప్రదేశాన్ని గంగాజలంతో శుద్ధి చేయడం అప్రజాస్వామికం

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

 హల్ద్వానీ ఘటనకు వ్యతిరేకంగా అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష 

 ఖర్గేకు సంఘీభావంగా తరలివచ్చిన శ్రేణులు.. నిందితులపై చర్యలకు డిమాండ్

భూపాలపల్లి , ఆగస్టు 14 (చక్రవాణి న్యూస్) : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పాల్గొన్న ర్యాలీ ప్రదేశాన్ని కొన్ని హిందూ మతవాద సంస్థలు గంగాజలంతో శుద్ధి చేయడాన్ని నిరసిస్తూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ దీక్షలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కరుణాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని మల్లికార్జున ఖర్గేకు సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్న దళిత నేత పట్ల ఇలాంటి వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. మతవాద సంస్థల అహంకారపూరిత చర్యలను దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, NREGS రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు రమేష్, పీసీసీ సభ్యులు చల్లూరి మధు, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మాజీ పీసీసీ సభ్యులు చల్లూరి సమ్మయ్య పాల్గొన్నారు.వీరితో పాటు కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మహాదేవపూర్ మాజీ జెడ్పిటిసి చల్ల తిరుపతి రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు బడితల వెంకటస్వామి, దుర్గం రాధా, సహదేవ్, టౌన్ ప్రెసిడెంట్ దాట్ల శ్రీనివాస్, మాజీ ప్రెసిడెంట్ దేవన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుతోట సుధాకర్, సీనియర్ నాయకులు జంపయ్య, బడితల రాజయ్య, సాంబమూర్తి, పున్నం రవి, గోమాస భూమయ్య, గోగుల మదన్మోహన్, కట్ట బ్రహ్మం, వివిధ మండలాల అధ్యక్షులు, మహిళా, యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం

Post a Comment

0 Comments