ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు రమేష్.. తాడిచర్ల సర్పంచ్ బండి స్వామి...
భూ నిర్వాసితుల పక్షాన నిలిచిన ప్రజా ప్రభుత్వం...
అబద్ధపు ప్రచారాలతో గందరగోళం వద్దు....
స్థానికులందరికి న్యాయం జరుగుతుందని వెల్లడి
మల్హర్ , ఆగస్టు 03 (చక్రవాణి న్యూస్) : తాడిచర్ల ఓపెన్ కాస్ట్ మైనింగ్ డేంజర్ జోన్ పరిధిలోని భూ నిర్వాసితుల ఇళ్ల సేకరణ సమస్యకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కృషితో శాశ్వత పరిష్కారం లభించింది. ఇందుకు సంబంధించి రూ. 261 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, తాడిచెర్ల - కాపురం భూనిర్వాసితుల కమిటీ అధ్యక్షులు దండు రమేష్, తాడిచర్ల సర్పంచ్ బండి స్వామి తెలిపారు. సోమవారం మండల కేంద్రమైన తాడిచర్ల లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో ఇళ్ల సేకరణ విషయంలో ప్రజలు మోసపోయారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ఈ సమస్య కొలిక్కి వచ్చిందని వివరించారు. కొందరు స్వార్థపరులు కోర్టు కేసుల వల్లే నిధులు వచ్చాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అందులో ఎలాంటి నిజం లేదని వారు ఖండించారు. జెన్‌కో సంస్థ మే 26, 2026 నాడే జిల్లా కలెక్టర్ ఖాతాలో రూ. 261 కోట్లు డిపాజిట్ చేసిందని గుర్తు చేశారు. కోర్టు జడ్జిమెంట్ రాకకంటే రెండు నెలల ముందే నిధులు జమయ్యాయని, జూలై 17, 2026 నుంచే అధికారులు సర్వే కూడా ప్రారంభించారని పేర్కొన్నారు.ఈ చారిత్రాత్మక విజయానికి క్రెడిట్ తాడిచర్ల ప్రజలకే దక్కుతుందని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. స్థానిక నిర్వాసితులందరికీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని, బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజలెవరూ అధైర్యపడకుండా, అబద్ధపు ప్రచారాలను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, దన్నపునేని సురేష్ రావు, కేసారపు చంద్రయ్య, రామిడి గట్టయ్య, ఆర్ని సత్యనారాయణ, ఇందారపు సిద్దు నిర్వాసితులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

No comments:
Post a Comment