తాడిచర్ల జెన్కో OCP-1 పరిహారం నిధులు స్వాహా..?


వాటర్ ట్యాంకుల పరిహారం పైసలు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? 

 మంథని ఆర్‌డీఓకు సర్పంచ్ బండి స్వామి,ఉపసర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ ఫిర్యాదు

మల్హర్, జూలై 27 (చక్రవాణి న్యూస్) : తాడిచర్ల గ్రామపంచాయతీకి చెందిన రెండు వాటర్ ట్యాంకులు, పైప్‌లైన్ల పరిహారం నిధులలో భారీ గోల్‌మాల్ జరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2010–2011 నాటి ఏపీ జెన్కో ఓపెన్ కాస్ట్ వన్ (OCP-1) భూసేకరణలో ఇవి కోల్పోయాయని సర్పంచ్ బండి స్వామి తెలిపారు. దీనికి సంబంధించి మంజూరైన సుమారు రూ. 45 లక్షల పరిహారం ఎవరి ఖాతాలోకి వెళ్లాయనేది గత 15 ఏళ్లుగా రహస్యంగా మారింది.ఈ నిధుల అక్రమాలపై సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు సోమవారం మంథని ఆర్‌డీఓ ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఆర్‌డీఓ.. ఈ వ్యవహారంపై త్వరలోనే పూర్తి స్థాయి విచారణ జరుపుతామని చెప్పినట్లు సర్పంచ్ బండి స్వామి తెలిపారు.
 అధికారుల నిర్లక్ష్యమా.. అక్రమార్కుల చేతివాటమా? 
 గత 15 ఏళ్లుగా ఈ నిధులు ఏమైనట్లు అనే విషయాన్ని ఇంతవరకు ఏ ఒక్క అధికారి గానీ, ప్రజాప్రతినిధి గానీ తేల్చకపోవడం గమనార్హం. అసలు ఈ ప్రజాధనం నిజంగానే అక్రమార్కుల చేతుల్లోకి మారి పక్కదారి పట్టిందా..? లేక అసలు జెన్కో పరిహారమే గ్రామపంచాయతీ ఖాతాలో జమ కాలేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనా, ఒక గ్రామానికి రావాల్సిన ఇంత పెద్ద మొత్తంలో వచ్చిన పరిహారం నిధులు ఎటు వెళ్లాయనేది మంథని ఆర్‌డీఓ పూర్తి స్థాయి అధికారిక విచారణలోనే తేలాల్సి ఉంది

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

Post a Comment

0 Comments