కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించిన ఎంపీ వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరబాద్ , జూలై 27 (చక్రవాణి న్యూస్) :
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, తెలంగాణ రాష్ట్ర గనులు మరియు కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గానికి అత్యంత కీలకమైన తాడిచర్ల బ్లాక్-2 బొగ్గు గని ప్రాజెక్టు పనులను ఆలస్యం కాకుండా త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
•స్థానిక యువతకు 1000 ఉద్యోగాలు ఇవ్వాలి•
తాడిచర్ల బ్లాక్-2 ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు, ముఖ్యంగా భూములు కోల్పోయిన ప్రభావిత గ్రామాల ప్రజలకు కనీసం 1000 ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు. ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ (రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్) ప్యాకేజీ కింద సమగ్ర పునరావాస, పునరుద్ధరణ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
•సింగరేణి కార్మికులకు ₹10,000 కనీస పెన్షన్•
సింగరేణి సంస్థలో పదవీ విరమణ పొంది, ప్రస్తుతం తక్కువ పెన్షన్‌తో ఇబ్బందులు పడుతున్న వేలాది మంది రిటైర్డ్ కార్మికుల సమస్యను పరిష్కరించాలని కేంద్ర మంత్రిని కోరారు. వారికి కనీస నెలవారీ పెన్షన్ ₹10,000 అందేలా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బొగ్గు గనుల విస్తరణ, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని చర్చించారు.
•కేంద్ర మంత్రి సానుకూల స్పందన•
ఈ అంశాలపై స్పందించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి.. తాడిచర్ల బ్లాక్-2 ప్రాజెక్టు పనులు, ఉద్యోగాల కల్పన, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంపు అంశాన్ని సంబంధిత శాఖలతో చర్చించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని సానుకూలంగా హామీ ఇచ్చారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

0 Comments