తాడిచర్ల విత్తన మేళాలో ఏఈఓ పృధ్విరాజ్ పిలుపు
మల్హర్ , జూలై 27 (చక్రవాణి న్యూస్) :
తక్కువ నీరు – ఎక్కువ లాభం" అనే సూత్రాన్ని పాటిస్తూ రైతులు సాంప్రదాయ వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని మండల వ్యవసాయ శాఖ అధికారి (AEO) పృధ్విరాజ్ కోరారు. సోమవారం తాడిచర్ల రైతు వేదికల్లో మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది 'ఎల్ నినో' ప్రభావం కారణంగా వర్షపాతంలో భారీ లోటు ఏర్పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని గుర్తుచేశారు. ఇటువంటి వర్షాభావ పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోకుండా ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవడమే ఏకైక మార్గమన్నారు.
రైతులకు అందుబాటులో నాణ్యమైన విత్తనాలు:
ఈ మేళాలో రైతులకు అవసరమైన కంది, పెసర, మినుము, మొక్కజొన్న మరియు వివిధ రకాల కూరగాయల నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతులు తమ సమీపంలోని రైతు వేదికలను సందర్శించి, అక్కడ ఉన్న వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనల మేరకు సరైన విత్తనాలను పొంది లాభసాటి వ్యవసాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ విత్తన మేళా కార్యక్రమంలో ఏఈఓలు పృథ్వీరాజ్, అనూష, సంధ్యారాణిలతో పాటు స్థానిక విత్తన డీలర్లు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని విజయవంతం చేశారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

0 Comments