కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బడితల రాజయ్య
పొరపాట్లు లేకుండా అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని పిలుపు
మల్హర్ , జూలై 17 (చక్రవాణి న్యూస్) : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితల రాజయ్య సూచించారు. శుక్రవారం నాచారంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిఎల్ఏ మరియు సూపర్‌వైజర్ల అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులన్నీ పూర్తి సమన్వయంతో, కలిసికట్టుగా పని చేయాలని కోరారు.ప్రతి ఇంటిని క్షేత్రస్థాయిలో సందర్శించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చూడాలని ఆయన పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తుటి లావణ్య దేవేందర్, వార్డు సభ్యులు సంపత్, అశోక్ మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

0 Comments