వార్డులలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్ గడ్డం క్రాంతి రణదేవ్
మల్హర్ , చక్రవాణి న్యూస్ :
మండలంలోని చిన్నతుండ్ల గ్రామంలోని 1వ మరియు 2వ వార్డులలో సీసీ రోడ్డు నిర్మాణ కార్యక్రమం చిన్నతుండ్ల గ్రామ సర్పంచ్ గడ్డం క్రాంతి చేతుల మీదుగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పులిగంటి సదయ్య, పులిగంటి అవినాష్, పులిగంటి రాజేశ్వరి-రమేష్, మంతెన సరిత-రమేష్ పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు పులిగంటి రాజయ్య, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు ఐలి చంద్రయ్య, గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు ఐలి నాగేష్, మాజీ ఉపసర్పంచ్ బొబ్బిలి సురేష్ హాజరయ్యారు. వీరితో పాటు గ్రామ సీనియర్ నాయకులు కమలాకర్ రావు, కోట శ్రీనివాస్, ఇమ్మడిశెట్టి సాయిరాం, కోట సమ్మన్న, కోట లక్ష్మయ్య, పులిగంటి బాపు, కూర నరేష్, ఓరుగంటి లక్ష్మయ్య, మిరియాల ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.

0 Comments