విద్యార్థుల విజయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు!
హైదరాబాద్
, జూలై 26 (చక్రవాణి న్యూస్) :
విద్యార్థులు సాధించిన అద్భుత విజయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించడం సిగ్గుచేటని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ధ్వజమెత్తారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థులు 36 రోజుల పాటు వీరోచితంగా ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని దిగివచ్చేలా చేశారని గుర్తుచేశారు. విద్యార్థుల పోరాటాల వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రమంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వెయ్యి శాతం ఇది విద్యార్థులు సాధించిన ఘన విజయమేనని స్పష్టం చేశారు.విద్యార్థుల కష్టాన్ని తాము సాధించినట్లుగా చూపిస్తూ నాలుగు గంటల పాటు నగర వీధుల్లో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు ఊరేగింపులు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీల వైఫల్యాలపై ఎక్కడ నిలదీస్తారోననే భయంతోనే ముఖ్యమంత్రి ముందుగానే బయటకు వచ్చి ఈ ఊరేగింపుల డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగ యువతను పూర్తిగా పట్టించుకోని ముఖ్యమంత్రి.. ఇప్పుడు 21 ఏళ్లకే యువత పార్లమెంట్ లో ఉండేలా బిల్లు తెస్తామంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ యువతకు ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. ఇకనైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ యువత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

No comments:
Post a Comment