Full width home advertisement

Post Page Advertisement [Top]

 హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో అత్యంత చాకచక్యంగా జరిగిన చోరీ ఘటన...

హైదరాబాద్‌ , జూలై 8 (చక్రవాణి న్యూస్) : మానత్వంతో సహాయం చేయబోయిన ఓ వ్యక్తిని నమ్మించి, క్షణాల వ్యవధిలో లక్ష రూపాయల విలువైన మొబైల్ ఫోన్‌ను కాజేసిన షాకింగ్ ఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఇద్దరు అంతర్రాష్ట్ర కేటుగాళ్లు పక్కా ప్లాన్‌తో ఈ వినూత్న చోరీకి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితుడు స్థానికంగా తన పనిలో నిమగ్నమై ఉండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు అపరిచిత వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే కిందపడిపోయారు. ప్రమాదం జరిగిందనే ఆందోళనతో బాధితుడు వారిని లేపేందుకు మానవత్వంతో ముందుకు వెళ్లాడు. బాధితుడి దృష్టి మళ్లిన ఆ ఒక్క క్షణంలోనే, దుండగుల్లో ఒకడు అతని పాకెట్లో ఉన్న రూ. 1 లక్ష విలువైన ఖరీదైన మొబైల్ ఫోన్‌ను అత్యంత చాకచక్యంగా దొంగిలించాడు. అనంతరం ఇద్దరూ నంబర్ ప్లేట్ లేని బైక్‌పై క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు. 
 సీసీటీవీలో రికార్డ్: 
 ఈ వినూత్న దొంగతనం మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా నిక్షిప్తమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సరూర్‌నగర్ పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.  ఈ ఘటనపై నగర పోలీసులు స్పందిస్తూ.. నగరంలో సరికొత్త తరహా మోసాలు, దొంగతనాలు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై అపరిచితులకు సహాయం చేసే సమయంలో చుట్టుపక్కల వారి కదలికలను గమనిస్తూ ఉండాలని, తమ మొబైల్ ఫోన్లు, పర్సులు, బంగారు ఆభరణాల పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని హెచ్చరించారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]