తాడిచెర్లలో మిన్నంటిన ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ సంబరాలు!

తాడిచెర్ల హనుమాన్ సెంటర్లో ఎగిరిన మాదిగ ఆత్మగౌరవ జెండా!

ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం: తాడిచెర్లలో ఘన నివాళులు

మల్హర్, జూలై 7 (చక్రవాణి న్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచెర్లలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కేసారపు నరేష్ మాదిగ ఆధ్వర్యంలో హనుమాన్ సెంటర్లో మాదిగ ఆత్మగౌరవ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ సాధనే ధ్యేయంగా సమాజ శ్రేయస్సు కోరి పోరాడిన మహోన్నత వ్యక్తి మందకృష్ణ మాదిగ అని కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తితోనే కార్యకర్తలంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన అమర వీరులను స్మరించుకుని ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాచర్ల వంశీకృష్ణ గౌడ్, సర్పంచ్ బండి స్వామి, సీనియర్ నాయకులు కేసారపు చంద్రయ్య, నారమళ్ళ నవీన్, కవ్వంపల్లి సందీప్, జంగం పోచయ్య, ఇందారపు శ్యామ్, వార్డు సభ్యులు ఇందారపు సారయ్య, కామ బాపు, మేనం రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

Post a Comment

0 Comments