సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు రాజమ్మకు సన్మానం

ఘనంగా సన్మానించిన చిన్నతూండ్ల సర్పంచ్ గడ్డం క్రాంతి రణదేవ్

మల్హర్,, జూలై 4 : మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలుగా ఇటీవల ఎన్నికైన కొయ్యురు గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మను శనివారం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిన్నతూండ్ల సర్పంచ్ గడ్డం క్రాంతి రణదేవ్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. కొండ రాజమ్మ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఆమె నాయకత్వంలో మండల అభివృద్ధి మరింత ముందుకు సాగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎడ్లపల్లి ఉప సర్పంచ్ వేల్పుల రమేష్, కొయ్యూరు మాజీ ఉప సర్పంచ్ కొండూరు మమత, వల్లెంకుంట గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత వార్డు సభ్యుడు గడ్డం ప్రేమ్ కుమార్, తాడిచెర్ల యూత్ అధ్యక్షుడు మేనం శ్రీను, పలువురు యువనాయకులు పాల్గొన్నారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

Post a Comment

0 Comments