జలసిరి' పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎంపీడీఓ క్రాంతి కుమార్
మల్హర్ , జూలై 27(చక్రవాణి న్యూస్) : ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు కురవని కరవు పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకునేలా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 'జలసిరి' కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి క్రాంతి కుమార్ పిలుపునిచ్చారు. మల్హర్ రావు మండల కేంద్రంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, వర్షభావ పరిస్థితులను అధిగమించేందుకు భూగర్భ జలాల పెంపుదల ఎంతో అవసరమన్నారు. ఇందులో భాగంగా వైబ్రేంట్ గ్రామ్ ప్రణాళికల ప్రకారం మండలంలోని ప్రతి ఇంటికీ ఒక ఇంకుడు గుంతను నిర్మించుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి పంట పొలంలోనూ పంట కుంటలు, ఊట కుంటలు మరియు బోరుబావుల వద్ద బోర్ వెల్ రీఛార్జ్ కుంటలను తప్పనిసరిగా నిర్మించాలని స్పష్టం చేశారు. ఈ నీటి నిల్వ నిర్మాణాల ద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేసి, భవిష్యత్తులో ఎదురయ్యే నీటి ఎద్దడిని నివారించవచ్చని పేర్కొన్నారు. పంచాయతీ అధికారులు, ప్రజలు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపీవో మల్లికార్జున్, మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

0 Comments