టియూఎఫ్ ఫోరం జిల్లా ప్రదాన కార్యదర్శి ముడితనపెల్లి ప్రభాకర్
మలహర్ మండల అధ్యక్షులు బూడిద సతీష్
మల్హర్ , జూలై 27(చక్రవాణి న్యూస్) :
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను కాలయాపన చేయకుండా త్వరితగతిన గుర్తించి ఆదుకోవాలని టియూఎఫ్ ఫోరం భూపాలపల్లి జిల్లా ప్రదాన కార్యదర్శి ముడితనపెల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు. సోమవారం మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు బూడిద సతీష్ ఆధ్వర్యంలో ఉద్యమకారుల ముఖ్య సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టియూఎఫ్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి ముడితనపల్లి ప్రభాకర్ హాజరై మాట్లాడారు. ఉద్యమకారుల హామీలను త్వరితగతిన నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారుల గుర్తింపు కొరకు కమిటీ వేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూనే, కమిటీ పేరుతో కాలయాపన చేయడం సరైనది కాదని విమర్శించారు. ప్రభుత్వం వచ్చి మూడేళ్లు సమయం గడుస్తున్నప్పటికీ ఇంకా కమిటీలతోనే కాలం వెళ్లదీయడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దంన్నర పాటు కష్టపడి, తమ వృత్తులను, వ్యాపారాలను, కుటుంబాలను పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమానికి అంకితమై, ఈరోజు ఎంతోమంది ఉద్యమకారులు అనారోగ్యంతో బాధపడుతూ గుర్తింపు లేక దుర్భర జీవితాలను గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం ప్రపంచంలోనే ఒక బలమైన ఉద్యమంగా సాగిందని గుర్తుచేశారు.దేశంలోని అనేక రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లలో ఉద్యమకారులను గుర్తించిన విధంగానే ఇక్కడ కూడా ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యమకారులను వెంటనే గుర్తించి ఆదుకోవాలని, వారికి గుర్తింపు కార్డులు, ప్రత్యేక సంక్షేమ పథకాలు, పెన్షన్లు మరియు హెల్త్ కార్డులు, బస్, ట్రైన్ పాస్ తో పాటు 250 గజాల ఇంటి స్థలం, ఇళ్లు నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం సిద్ధించి 10 సంవత్సరాలు దాటినా ఉద్యమకారులకు కనీస గుర్తింపు లేకపోవడం దౌర్భాగ్యమన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులను వెంటనే ఆదుకోవాలని కేకే కమిటీ సూచనలు, అభిప్రాయాల పేరుతో కాలయాపన చేస్తే తెలంగాణలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమ కారులు షేక్ చాంద్ పాష, చొప్పరి రాజు, కోట నవీన్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

0 Comments