Full width home advertisement

Post Page Advertisement [Top]

అంత్యక్రియల్లో పాల్గొని పాడే మోసిన తిర్రి అశోక్ గౌడ్, ఇందారపు సారయ్య...

మల్హర్ , జూలై 6 : మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన జాలిగపు మల్లయ్య అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక వార్డు సభ్యులు తిర్రి అశోక్ గౌడ్, ఇందారపు సారయ్యలు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం మల్లయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మల్లయ్య అంతిమ యాత్రలో పాల్గొన్న వార్డు సభ్యులు.. స్వయంగా పాడే మోసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. రజకులస్థులకు, వారి కుటుంబానికి మల్లయ్య మృతి తీరని లోటని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]