రామారావుపల్లె పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు

ప్రధానోపాధ్యాయురాలు బి. పద్మ

మల్హర్ , జూలై 06: మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామ పరిధిలోని రామారావుపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ నుండి ఉత్తర్వులు వచ్చినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. పద్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లిదండ్రులందరూ తమ నాలుగు సంవత్సరాల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని ఆమె పేర్కొన్నారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

Post a Comment

0 Comments