వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సేవా కార్యక్రమాలు. . . పాల్గొన్న హైదరాబాద్ వైద్య నిపుణులు
మల్హర్ , మల్హర్ (చక్రవాణి న్యూస్) :
స్థానిక శ్రీ హనుమాన్ సహిత శివ పంచాయతన సుబ్రహ్మణ్యేశ్వర దత్తాత్రేయ ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయంలో చండీ హోమం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఉత్సవాల సందర్భంగా వేద త్రిపుర పీఠం గురువులు శ్రీ మోతే విశ్వనాథం గురువుగారి శిష్యబృందం ఆధ్వర్యంలో గ్రామ ప్రజల కోసం ఉచిత మెడికల్ క్యాంపు (వైద్య శిబిరం) ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఈఎన్‌టీ నిపుణులు డాక్టర్ ఐ. సందీప్ (MBBS, MS ENT), జనరల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ ప్రతిభ గాయత్రి సిస్టల (MBBS, MD General Medicine), అచ్చిలాపూర్ వాస్తవ్యులు, జనరల్ సర్జన్ డాక్టర్ ముద్దు రాఘవ కృష్ణ (MS General Surgeon), డాక్టర్ వారి మౌక్తిక (MBBS) తదితర నిపుణులైన వైద్యులు పాల్గొని గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు.బాధితులకు పరీక్షలతో పాటు వారికి అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో హనుమాన్ సహిత శ్రీ పంచాయతన త్రిపుర పీఠ గురువులు లోకే రాము, గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, ఆలయ కమిటీ సభ్యులు మండల రాహుల్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.



No comments:
Post a Comment