వృధా చేయకుండా పంపులను సిద్ధం చేయాలి
హైదరబాద్ , జూలై 28(చక్రవాణి న్యూస్) : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నీటిని వృధాగా సముద్రంలోకి వదలకుండా, రైతుల ప్రయోజనాల కోసం తక్షణమే ఉపయోగించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు. ఇందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పంప్‌హౌస్‌లు, మోటార్లు, ఇతర ఎత్తిపోతల వ్యవస్థలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అందుబాటులోకి వస్తున్న వరద నీటిని వెంటనే అవసరమైన ప్రాంతాలకు తరలించి, చెరువులు మరియు రిజర్వాయర్లను నింపడం ద్వారా సాగునీటి అవసరాలను తీర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.గతంలో ఉన్న నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని, ఈ వర్షాకాలంలో వచ్చే ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసుకునేలా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ప్రజలు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటి నుంచే పంప్‌హౌస్‌లను పరిశీలించి, సాంకేతిక సమస్యలు లేకుండా అవసరమైన మరమ్మతులు పూర్తి చేసి నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. మేడిగడ్డతో పాటు పరివాహక ప్రాంతంలోని ఇతర బ్యారేజీలు, రిజర్వాయర్ల పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ఒక్క టీఎంసీ నీరు కూడా వృధా కాకుండా ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ రూపొందించి రైతులకు భరోసా కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:


0 Comments