తెలంగాణలో 'ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్'

మీసేవ ద్వారా జారీకి ప్రభుత్వం నిర్ణయం!

:హైదరాబాద్‌, జూలై 28 (చక్రవాణి న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన అధికారిక వివరాలను ఒకే చోట పొందుపరిచేలా 'ఫ్యామిలీ రిజిస్టర్'ను తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల డేటా ఆధారంగా ఈ ఫ్యామిలీ రిజిస్టర్‌ను రూపొందించనున్నారు. ఇందులో భాగంగానే ప్రజల సౌకర్యార్థం ప్రతి కుటుంబానికి అధికారికంగా 'ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్'ను కూడా జారీ చేయనున్నారు. ఈ సర్టిఫికెట్లను ప్రజలు సులభంగా పొందేలా 'మీసేవ' (Meeseva) కేంద్రాల ద్వారా వీటిని అందజేసేందుకు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.వివిధ రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సాంకేతిక సమస్యలను శాశ్వతంగా తొలగించే ప్రక్రియలో భాగంగానే ఈ సరికొత్త విధానాన్ని తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ రిజిస్టర్ అందుబాటులోకి వస్తే ప్రభుత్వ పథకాల అర్హుల ఎంపిక మరింత పారదర్శకంగా మారనుంది.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

Post a Comment

0 Comments