ఎల్‌నినో కరువు పరిస్థితుల నేపథ్యంలో కీలక నిర్ణయం.. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కోటా ఒకేసారి పంపిణీ.
18 కిలోల బియ్యం పంపిణీ.. స్టాక్ నిల్వ, ఈ-పాస్ సమస్యలపై డీలర్ల ఆందోళన.
హైదరాబాద్ , 29(చక్రవాణి న్యూస్) :
ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో పేద, బలహీన వర్గాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఒక్కో లబ్ధిదారునికి నెలకు 6 కిలోల చొప్పున, మూడు నెలలకు కలిపి మొత్తం 18 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందించనున్నారు. గతంలో తీవ్ర వేసవి పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్, మే, జూన్ నెలల కోటాను కూడా ఇదే రీతిన ఒకేసారి పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, తాజా ఉత్తర్వులతో తెలంగాణవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులు పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లోని రేషన్ దుకాణాలకు బియ్యం కోటాను చేరవేస్తున్నారు.
•డీలర్ల ఇబ్బందులు..
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కార్డుదారులకు ఎంతో ప్రయోజనకరంగా మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో రేషన్ డీలర్లు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకేసారి మూడు నెలల భారీ స్టాక్ వస్తుండటంతో, దుకాణాల్లో నిల్వ సామర్థ్యం (Storage Space) లేక సరుకును భద్రపరచడం కష్టంగా మారిందని వాపోతున్నారు. దీనికి తోడు:
•తూకంలో తరుగు: ఎక్కువ రోజులు బియ్యం నిల్వ ఉండటం వల్ల బరువు తగ్గి తరుగు వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
.
•సాంకేతిక లోపాలు: నెట్‌వర్క్ సమస్యల కారణంగా ఈ-పాస్ (e-PoS) యంత్రాలు సక్రమంగా పనిచేయడం లేదు.
•సమయం వృథా: ఒక్కో లబ్ధిదారుడు ఒకేసారి మూడు నెలల కోటాను తీసుకుంటున్నందున, రేషన్ దుకాణాల్లోని ఈ-పాస్ యంత్రాలపై
•మూడు సార్లు వేలిముద్రలు (Biometric) వేయాల్సి ఉంటుంది. ఒక్కో లబ్ధిదారుని వేలిముద్రలు సరిపోలడానికి దాదాపు 15 నుండి 20 నిమిషాల సమయం పడుతుండటంతో దుకాణాల వద్ద గంటల కొద్దీ క్యూ లైన్లు పెరుగుతున్నాయని డీలర్లు చెబుతున్నారు. భవిష్యత్తులోనైనా ఈ సాంకేతిక లోపాలను సరిచేయాలని కోరుతున్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

No comments:
Post a Comment