మండలంలో ‘SIR’ ప్రక్రియను ప్రతి గ్రామం, ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో మరింత వేగవంతంగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని ‘SIR’ పరిశీలన మల్హర్ రావు మండల ఇన్చార్జ్ పంతకాని సమ్మయ్య బూత్ లెవెల్ అధికారులు (BLA), సూపర్వైజర్లకు సూచించారు.శుక్రవారం మండల పరిధిలోని మల్లారం, చిన్నతుండ్ల, తాడిచెర్ల, కిషన్ రావు పల్లె, అడువలపల్లి గ్రామాలలో ఆయన పర్యటించి, ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మల్హర్ రావు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బడితల రాజయ్య, NREGS రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు కొండ రాజమ్మ, SIR ఇంచార్జ్ మమత, సర్పంచ్ బండి స్వామి, ఇప్ప మొండయ్య, సురేష్ రావు, ఇందారపు చంద్రయ్య, ఇందారపు ప్రభాకర్, వార్డు సభ్యులు మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews | #అవినీతిపై_సుదర్శన_చక్రం | #అన్యాయంపై_విష్ణుచక్రం | #నిజం_వైపు_చక్రవాణి

No comments:
Post a Comment