ఉచిత గైనకాలజీ వైద్య శిబిరం:


వరంగల్ అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్స్‌లో జూలై 13 నుండి ఉచిత మహిళా గైనకాలజీ ఆరోగ్య శిబిరం


ప్రముఖ స్త్రీ వ్యాధుల నిపుణురాలు డా. రమ్య దాస్యం ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు

వరంగల్, జూలై 25 (చక్రవాణి న్యూస్): మహిళల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా వరంగల్‌లోని అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జూలై 13, 14, 15 తేదీలలో మూడు రోజుల పాటు ఉచిత ప్రత్యేక మహిళా గైనకాలజీ ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ శిబిరంలో ప్రముఖ ప్రసూతి, స్త్రీ వ్యాధుల నిపుణురాలు డా. రమ్య దాస్యం (MBBS, DGO, Fellow in Infertility, Fellow in Diagnostic & Operative Hysteroscopy) పాల్గొని మహిళలకు సమగ్ర వైద్య సేవలు అందిస్తారు. పీసీఓడీ (PCOD), పీరియడ్స్ సమస్యలు, సంతానలేమి, వైట్ డిశ్చార్జ్, ఫైబ్రాయిడ్స్, గర్భాశయ సంబంధిత వ్యాధులు, మెనోపాజ్ సమస్యలతో బాధపడే వారికి ఈ శిబిరంలో నిపుణుల సలహాలు, అవసరమైన చికిత్సలు అందించబడతాయి.
ఉచిత పరీక్షలు: శిబిరానికి హాజరయ్యే మహిళలకు హిమోగ్లోబిన్ పరీక్ష, రాండమ్ బ్లడ్ షుగర్ పరీక్షలతో పాటు, వైద్యుల సూచన మేరకు అవసరమైన వారికి అల్ట్రాసౌండ్ పెల్విస్ స్కాన్ ఉచితంగా నిర్వహించబడుతుంది.
వివరాలు:సమయం: 
ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకువేదిక: అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్, కొత్తపేట క్రాస్ రోడ్, వరంగల్.మహిళలు తమ ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఈ ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం కోరింది. 
శిబిరంలో పాల్గొనదలిచిన వారు ముందస్తు పేరు నమోదు కోసం 9459875555 నంబర్‌ను సంప్రదించవచ్చు.



ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

Post a Comment

0 Comments