Full width home advertisement

Post Page Advertisement [Top]

విద్యుత్ అంతరాయాలకు చెక్.. నిరంతర సరఫరాకు విద్యుత్తు శాఖ ఎస్.ఈ రమేష్ పిలుపు

మల్హర్ , జూలై 26(చక్రవాణి న్యూస్) : కాటారం డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మించిన 33 కేవీ ఇంటర్‌లింకింగ్ లైన్‌ను విజయవంతంగా విద్యుత్ సరఫరాకు అనుసంధానం (చార్జ్) చేసినట్లు విద్యుత్తు శాఖ ఎస్.ఈ రమేష్ తెలిపారు.ఏ ఎం ఆర్ 4 పోల్స్ డీపీ స్ట్రక్చర్ నుండి 33/11 కేవీ పెద్ద తుండ్ల సబ్ స్టేషన్ వరకు నిర్మించిన ఈ ఇంటర్‌లింకింగ్ లైన్ ద్వారా ఏ ఎం ఆర్ 33/11 కేవీ తాడిచెర్ల మరియు 33/11 కేవీ పెద్ద తుండ్ల సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నూతన ప్రాజెక్ట్ ద్వారా భవిష్యత్తులో విద్యుత్ అంతరాయాలు తగ్గి, వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందుతుందని వివరించారు. ఈ సంక్లిష్టమైన పనులను గడువులోగా, విజయవంతంగా పూర్తి చేసిన విద్యుత్ శాఖ అధికారులు, లైన్ సిబ్బందిని ఎస్.ఈ రమేష్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]