గిరిజన ఆశ్రమ, దివ్యాంగుల పాఠశాలల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె. జీవన్ కుమార్ సర్ప్రైజ్ విజిట్.. వసతులపై ఆరా!
భూపాలపల్లి, జూలై 26: భూపాలపల్లి పట్టణంలోని గิరిజన ఆశ్రమ పాఠశాల, హెచ్.ఎం.ఆర్.డి.ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న దివ్యాంగ విద్యార్థుల పాఠశాలలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు శ్రీ జె.జీవన్ కుమార్ గారు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. పాఠశాలల్లోని వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. వారికీ సరైన ఆహారం అందుతుందా లేదా అనేది అడిగి తెలుసుకున్నారు. పిల్లలను తమ సొంత కుటుంబ సభ్యుల్లాగా జాగ్రత్తగా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి.అఖిల గారు, అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కూనూరు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


0 Comments