ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్
మల్హర్ , [ఆగస్టు 1(చక్రవాణి న్యూస్) :
మండలంలోని ఎడ్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం నందు శనివారం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల శాంక్షన్ పత్రాలను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, ఎంపికైన 6గురు లబ్ధిదారులకు ఈ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేదల సొంతింటి కలను నిజం చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేల్పుల రమేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తొగరి శంకర్, అజ్మీరా శివ, వివిధ వార్డుల సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

0 Comments