ఎన్నికల హామీని నిలబెట్టుకున్న మంత్రి శ్రీధర్ బాబు
భూ నిర్వాసితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం
ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు రమేష్, తాడిచర్ల సర్పంచ్ బండి స్వామి
మల్హర్ , ఆగస్టు 1(చక్రవాణి న్యూస్) :
తాడిచర్ల టీఎస్ జెన్ కో (TS Genco) ఉపరితల బొగ్గు గని డెంజర్ జోన్ పరిధిలో ప్రభుత్వం జరుపుతున్న సర్వేను తెలంగాణ ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, తాడిచర్ల - కాాపురం భూ నిర్వాసితుల కమిటీ అధ్యక్షులు దండు రమేష్, గ్రామ సర్పంచ్ బండి స్వామి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డెంజర్ జోన్ భూ నిర్వాసితుల శ్రేయస్సే ధ్యేయంగా తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు.దశాబ్ద కాలంగా బొగ్గు గని వల్ల వస్తున్న దుమ్ము, ధూళి, విష వాయువులతో ప్రజలు రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్స్ వల్ల ఇళ్లు కూలిపోయి, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న బాధితుల కోసం గత 9 ఏళ్లుగా తాము పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. అయితే, గత ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి, తమపై అక్రమ కేసులు పెట్టించి తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని మండిపడ్డారు. తమ సుదీర్ఘ పోరాటం ప్రస్తుత కాంగ్రెస్ ప్రజాపాలనలోనే నెరవేరిందని వారు హర్షం వ్యక్తం చేశారు.
మంత్రి శ్రీధర్ బాబు చొరవతోనే నిధులు:
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 2023 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని వారు కొనియాడారు. మంత్రి చొరవతో టీఎస్ జెన్ కో యాజమాన్యంతో మాట్లాడి, పరిహారానికి సంబంధించిన నిధులను జిల్లా కలెక్టర్ ఖాతాలో డిపాజిట్ చేయించిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. ప్రస్తుతం సర్వే చేస్తున్న అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించి, నిజమైన బాధితులను గుర్తించి తగిన న్యాయం చేయాలని కోరారు. మొదట గ్రామ పంచాయితీ రికార్డుల ప్రకారం సర్వే జరుగుతుందని, ఆ వెంటనే రికార్డుల్లో లేని ఇళ్లను కూడా సర్వే చేస్తారని, కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నిర్వాసితులు ఎవరూ ఫేక్ ప్రచారాలను నమ్మవద్దని, మీ వద్ద ఉన్న డాక్యుమెంట్లను సర్వే అధికారులకు అందించి సహకరించాలని పిలుపునిచ్చారు. బాధితులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చట్టపరమైన సహాయం అందించేందుకు హైకోర్టు సీనియర్ న్యాయ నిపుణులు కూడా సిద్ధంగా ఉన్నారని దండు రమేష్, బండి స్వామి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

0 Comments