- తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి
హైదరబాద్, జూలై 24 (చక్రవాణి న్యూస్) :
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (#టియూఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గత తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని ఫోరం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని అమర జ్యోతి కార్యాలయంలో జరిగిన మహిళా ఉద్యమ కారుల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టియూఎఫ్ ఫోరం చేసిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే నేడు రాష్ట్రంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటు అయిందని ఆమె స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఉద్యమకారుల గుర్తింపు కమిటీని ఏర్పాటు చేసినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు, రాష్ట్ర క్యాబినెట్ మంత్రివర్గానికి మరియు కే. కేశవరావు అధ్యక్షతన ఏర్పాటైన గుర్తింపు కమిటీకి, సోనియా గాంధీకి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు.
హామీల అమలులో కాలయాపన వద్దు:
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను ఎలాంటి కాలయాపన చేయకుండా ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయాలని జ్యోతి రెడ్డి డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఉద్యమకారుడిని గుర్తించి, వారికి 250 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం కోసం రూ. 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం, నెలకు రూ. 25 వేల పెన్షన్, ఉచిత హెల్త్ కార్డ్‌లు, బస్ పాస్ మరియు ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. జార్ఖండ్ రాష్ట్ర తరహాలోనే తెలంగాణలోనూ ఉద్యమకారులను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.
పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి:
ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకునేందుకు వారి పిల్లలకు ఉద్యోగ, విద్యా, వైద్య మరియు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో సైతం తగిన వాటా కేటాయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
మహిళా ఉద్యమకారులకు 20% కోటా ఇవ్వాలి:
ఉద్యమ సమయంలో తాము ప్రాణాలకు తెగించి పోరాడామని, జైలు జీవితం గడపడంతో పాటు ఎన్నో పోలీస్ కేసులను ఎదుర్కొన్నామని జ్యోతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని, రాజకీయ పదవులతో పాటు ప్రతి విషయంలోనూ మహిళా ఉద్యమకారులకు 20 శాతం కోటాను (రిజర్వేషన్) కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆడబిడ్డలను, మహిళలను గుర్తించినప్పుడే ఏ ప్రభుత్వానికైనా నిజమైన గౌరవం దక్కుతుందని ఆమె పేర్కొన్నారు.
Please subscribe YouTube 👇
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

0 Comments