శిథిలావస్థకు చేరిన పూర్వ నివాస గృహాలను కూడా సర్వేలో పరిగణించాలి

కాటారం సబ్‌కలెక్టర్‌కు వినతి

మల్హర్ , జూలై 16 (చక్రవాణి న్యూస్) : జెన్‌కో తాడిచెర్ల క్యాప్టివ్ కోల్ బ్లాక్–1 పరిధిలోని 500 మీటర్ల డేంజర్ జోన్‌లో ప్రస్తుతం నిర్వహిస్తున్న సామాజిక–ఆర్థిక సర్వే (Socio Economic Survey)లో పాక్షికంగా దెబ్బతిన్న, శిథిలావస్థకు చేరిన, పూర్తిగా కూలిపోయిన లేదా ప్రస్తుతం నివాసయోగ్యం కాక ఖాళీగా ఉన్న పూర్వ నివాస గృహాలను కూడా Genuine Housesగా పరిగణించి సర్వేలో నమోదు చేయాలని కోరుతూ తాడిచెర్ల–కాపురం గ్రామాల భూ నిర్వాసిత హక్కుల సాధన పోరాట కమిటీ అధ్యక్షుడు కేసరపు రవి గురువారం కాటారం సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రంలో జిల్లా కలెక్టర్ Proceedings No. G/2311/2022, తేదీ 15-07-2026 ప్రకారం డేంజర్ జోన్‌లో నిర్వహిస్తున్న సర్వే సందర్భంగా ప్రస్తుతం ఇంటి స్థితిని మాత్రమే కాకుండా, 2021–22 సంవత్సరంలో జెన్‌కో కేటాయించిన ఇంటి నంబర్లు, అప్పట్లో తీసిన వీడియోలు, ఫోటోలు, జెన్‌కో మరియు రెవెన్యూ శాఖల అధికారిక రికార్డులను కూడా ప్రామాణిక ఆధారాలుగా పరిగణించాలని కోరారు. జెన్‌కో ప్రాజెక్టు కారణంగా భూములు కోల్పోయిన తరువాత శాశ్వత జీవనోపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, గత ఎనిమిదేళ్లుగా జరుగుతున్న బ్లాస్టింగ్, అధిక వర్షాలు, కాలగమన ప్రభావం, మరమ్మతులు చేయించుకునే ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల అనేక గృహాలు శిథిలావస్థకు చేరాయని వివరించారు. ప్రస్తుతం నివాసయోగ్యం కాకపోవడంతో అనేక కుటుంబాలు బంధువుల ఇళ్లు, అద్దె ఇళ్లు లేదా ఇతర సురక్షిత ప్రాంతాలకు తాత్కాలికంగా వెళ్లి నివసిస్తున్నాయని, ప్రస్తుతం ఆ ఇంటిలో ఎవరూ నివసించడం లేదనే కారణంతో వారిని నష్టపరిహారం, పునరావాస ప్రయోజనాలకు అనర్హులుగా ప్రకటించడం అన్యాయమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్న "Genuine Houses", "Eligible Beneficiaries" భావనకు అనుగుణంగా నిజమైన నివాస కుటుంబాలందరినీ గుర్తించాలని, పాక్షికంగా దెబ్బతిన్న, శిథిలావస్థకు చేరిన లేదా కూలిపోయిన గృహాలను కూడా సర్వేలో చేర్చి అర్హులైన ప్రతి కుటుంబానికి పూర్తి నష్టపరిహారం, చట్టబద్ధమైన పునరావాస ప్రయోజనాలు కల్పించాలని వినతిపత్రంలో కోరారు. RFCTLARR చట్టం–2013 లక్ష్యాలు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్–21 స్ఫూర్తికి అనుగుణంగా ఏ నిజమైన నిర్వాసిత కుటుంబమూ కేవలం గృహం ప్రస్తుతం శిథిలావస్థలో ఉందనే కారణంతో లేదా ప్రస్తుతం ఆ ఇంటిలో నివసించడం లేదనే కారణంతో నష్టపోకుండా మానవతా దృక్పథంతో న్యాయం చేయాలని, సర్వేలో ప్రతి అర్హ కుటుంబానికి అవకాశం కల్పించాలని కేసరపు రవి సబ్‌కలెక్టర్‌ను కోరారు. నిర్వాసిత కుటుంబాల పరిస్థితిని మానవత్వంతో పరిగణించి న్యాయమైన పూర్తి నష్టపరిహారం, చట్టబద్ధమైన పునరావాస ప్రయోజనాలు అందేలా సహకరించాలని వినతిపత్రం అందజేస్తూ విజ్ఞప్తి చేశారు.

ప్రజా పక్షం — అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

Post a Comment

0 Comments