భూపాలపల్లి, జూలై 30 (చక్రవాణి న్యూస్) :
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసిందని, ఆపద సమయంలో వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని తెలిపారు.
•పోలీసు శాఖ ముఖ్య సూచనలు:
•ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, చెరువులు, నదుల్లోకి దిగవద్దు.
•చేపల వేటకు వెళ్లడం, మునిగిన కల్వర్టులు దాటడం చేయవద్దు.
•పశువుల కాపరులు, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు పాటించాలి.
•విద్యుత్ స్తంభాలు, తెగిపడిన తీగలకు దూరంగా ఉండాలి.
• శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించకూడదు.
•అత్యవసరం కాని దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి.
•సెల్ఫీలు, రీల్స్ కోసం వరద ప్రాంతాలు, జలపాతాల వద్దకు వెళ్లొద్దు.
ప్రజలందరూ పోలీసు, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

No comments:
Post a Comment