పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలపై మంత్రి శ్రీధర్ బాబు అత్యవసర సమీక్ష
ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశం
మల్హర్ , జూలై 30 (చక్రవాణి న్యూస్) :
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలోని వాస్తవ పరిస్థితులపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నుంచి జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.ఈ సందర్భంగా జిల్లాలో వర్షాల తీవ్రత, లోతట్టు ప్రాంతాల పరిస్థితి, ప్రజలకు అందుతున్న సహాయక చర్యలపై మంత్రి ఆరా తీశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అత్యవసర సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన కార్యాచరణపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అధికారులు అలసత్వం వహించకుండా, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:
