చికెన్ తిని 50 మంది విద్యార్థినులకు అస్వస్థత! మహిళా పాలిటెక్నిక్ హాస్టల్లో కలకలం.. ఆస్పత్రికి తరలింపు
పాలమూరు,అక్టోబర్ 9(చక్రవాణి న్యూస్):వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ శివారులోని మహిళా పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. బుధవారం రాత్రి భోజనంలో చికెన్ తిన్న సుమారు 40 నుంచి 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. కడుపునొప్పితో బాధపడుతూ కొందరు విద్యార్థినులు కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.విద్యార్థినుల అస్వస్థతను గమనించిన వార్డెన్ వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అయితే, ఘటనకు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. విద్యార్థినులకు వైరల్ ఫీవర్ వచ్చిందని చెబుతూ అసలు విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలపైనా అధికారులు స్పందించాల్సి ఉంది.
విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
