చిన్న పనికైనా రోజుల తరబడి ప్రదక్షిణలు.. పనులు కాక అల్లాడుతున్న మండల ప్రజలు
తహసీల్దార్ కార్యాలయంలో ఆరుగురితోనే పనులు ఎలా సాధ్యం..!
కలెక్టర్ గారు చొరవ చూపాలని స్థానిక ప్రజల వేడుకోలు
మల్హర్ , ఆగస్టు 13(చక్రవాణి న్యూస్) :
మండల కేంద్రమైన తాడిచర్లలోని తహసీల్దార్ కార్యాలయం తీవ్ర సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది. ఈ కార్యాలయంలో మొత్తం పద్దెనిమిది మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం ఆరుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఇంత పెద్ద మండలానికి కేవలం ఆరుగురితోనే పనులు చేయడం ఎలా సాధ్యమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సిబ్బంది లేక రోజువారీ పనులు పూర్తిగా నిలిచిపోవడంతో సామాన్య జనం అల్లాడిపోతున్నారు. కార్యాలయంలో అత్యంత కీలకమైన ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఇద్దరు సహాయకులు, ఒక అటెండర్ ఉద్యోగాలతో పాటు భూముల కొలతలు చూసే సర్వేయర్ ఉద్యోగం కూడా పూర్తిగా ఖాళీగా ఉంది. సర్వేయర్ లేకపోవడంతో మండలంలో భూముల కొలతలు, సరిహద్దు వివాదాల పరిష్కారాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఒక చిన్న సంతకం లేదా ఒక చిన్న కాగితం కోసం కూడా రైతులు, వృద్ధులు నిత్యం కార్యాలయ మెట్లు ఎక్కి దిగాల్సి వస్తోంది.
• సిబ్బందికి తలకు మించిన పని భారం... చిన్న పనికైనా రోజుల తరబడి సామాన్య జనం ప్రదక్షిణలు•
తాడిచర్ల ఓసీపీ-1 గనికి డేంజర్ జోన్ పరిధిలోని ఇళ్లు, భూముల సేకరణ అత్యవసర సర్వేల బాధ్యత, మరో వైపు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూ సేకరణ, భూభారతి, సాదాబైనామా పనుల భారం ఈ ఆరుగురిపైనే తలకు మించిన భారం పడుతుంది. మరోవైపు విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం వందలాది మంది విద్యార్థులు, రైతులు చిన్న పనికైనా రోజుల తరబడి కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి వస్తోంది.
•కలెక్టర్ గారు చొరవ చూపాలని స్థానిక ప్రజల వేడుకోలు•
సమస్యల వలయంలో చిక్కుకున్న తాడిచర్ల రెవెన్యూ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా పరిశీలించాలని, తగిన చొరవ చూపాలని మండల ప్రజలు వేడుకుంటున్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి, లేదా తాత్కాలికంగానైనా కొత్త సిబ్బందిని నియమించి కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో నడిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

No comments:
Post a Comment