వెల్మలపల్లి పాఠశాలలో అల్పాహారం ప్రారంభం
మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో విద్యార్థులకు అల్పాహారం.. ప్రారంభించిన సర్పంచ్ బండి స్వామి
మల్హర్, అక్టోబర్ 6 (చక్రవాణి న్యూస్): మల్హర్రావు మండల కేంద్రంలోని ఇటీవల పునఃప్రారంభమైన ఎం.పి.పి.ఎస్. వెల్మలపల్లి పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చొరవతో హెచ్‌కేఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ బండి స్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ బండి స్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న మంత్రి శ్రీధర్‌బాబుకు, హెచ్‌కేఎం ఫౌండేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కోరారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు పమ్మిడి నిరంజన్‌రావు, చల్ల మహేందర్, పూర్వ విద్యార్థులు రాగం అనిల్, కుక్కడపు వెంకటేశ్వర్లు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సురేష్, గంగరాజు, సీఆర్పీ సమత తదితరులు పాల్గొన్నారు.
