టీయూడబ్ల్యూజే హెచ్-143 మండల అధ్యక్షుడిగా రాజ కొమురయ్య
ప్రధాన కార్యదర్శిగా సంతోష్ గౌడ్, కోశాధికారిగా రమేష్
టేకుమట్ల, (చక్రవాణి న్యూస్): తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే హెచ్-143) టేకుమట్ల మండల అధ్యక్షుడిగా అంకుషాపూర్ గ్రామానికి చెందిన సూర్య దినపత్రిక విలేకరి మారేపల్లి రాజ కొమురయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేగొండ మండలం కొడవటంచలో జరిగిన డివిజన్ స్థాయి సమావేశంలో రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా గొల్లపల్లి సంతోష్ గౌడ్, కోశాధికారిగా కన్నూరి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
