ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలి:టిఆర్పీ జిల్లా అధ్యక్షులు రవి పటేల్
భూపాలపల్లి అక్టోబర్ 22 (చక్రవాణి న్యూస్): జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెకు గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 100 శాతం గ్రాస్ జీతాలు, ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు. ప్రతి సంవత్సరం 5 శాతం ఇంక్రిమెంట్, 8 శాతం హెల్త్ బోనస్, 180 రోజుల ప్రసూతి సెలవులు, ఈహెచ్ఎస్/ఈఎస్ఐ వైద్య సదుపాయాలు అందించాలని పేర్కొన్నారు. పెండింగ్ వేతనాలు, పీఆర్సీ, ఇతర ఆర్థిక ప్రయోజనాలను కూడా వెంటనే పరిష్కరించాలని అన్నారు.ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి సమ్మెను ముగించేలా చర్యలు తీసుకోవాలని రవి పటేల్ విజ్ఞప్తి చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల హక్కుల సాధనకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అంబాల నరసయ్య, గట్టు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.