గిరిజన యువతకు పోలీసు ఉద్యోగాలపై ఉచిత శిక్షణ... ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన గిరిజన యువతీ, యువకులకు పోలీసు కానిస్టేబుల్, సబ్ఇన్స్పెక్టర్ ఉద్యోగాల సాధన కోసం ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో సోమవారం తెలిపారు.గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిక్షణకు ఎంపికయ్యే అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన గిరిజన యువత కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, స్టడీ సర్టిఫికెట్లు, పోలీసు ఉద్యోగానికి దరఖాస్తు చేసిన పత్రం ప్రతితో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.పోలీసు నియామక నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగిన ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని పీఓ తెలిపారు. గిరిజన నిరుద్యోగ యువత ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
