రీఛార్జ్ ధరలకు మళ్లీ రెక్కలు!
12–15 శాతం వరకు పెంపు యోచన.. 5జీ ఖర్చులే కారణం
అక్టోబర్ 6, హైదరాబాద్ చక్రవాణి న్యూస్) : మొబైల్ వినియోగదారులకు మరోసారి రీఛార్జ్ ధరల పెంపు భారం పడే అవకాశం కనిపిస్తోంది. రాబోయే 4–5 నెలల్లో దేశీయ టెలికాం సంస్థలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం.5జీ నెట్వర్క్ విస్తరణ, నిర్వహణ వ్యయాలు పెరగడంతో పాటు వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ)ను పెంచుకోవడంపై టెలికాం సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తదితర సంస్థలు రీఛార్జ్ ధరలను సుమారు 12 నుంచి 15 శాతం వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే పెరిగిన జీవన వ్యయాలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులపై మరోసారి టెలికాం ధరల పెంపు అదనపు ఆర్థిక భారంగా మారే అవకాశం ఉంది.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
