తాడిచర్లలో ఘనంగా విజయదశమి వేడుకలు
గ్రామస్థులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ బండి స్వామి
పాలకవర్గ సభ్యులతో సందడిగా దసరా సంబరాలు
మల్హర్, అక్టోబర్ 20 (చక్రవాణి న్యూస్) :విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తాడిచర్ల గ్రామంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బండి స్వామి, పాలకవర్గ సభ్యులు గ్రామస్థులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలో పండుగ సందడి నెలకొనగా, గ్రామస్థులు పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు. విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని, ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు సాగుతూ, సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నారు. ఈ వేడుకల్లో గ్రామస్థులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
