తాడిచర్ల సాయి వాణి విద్యానికేతన్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు
సంప్రదాయ పూల పండుగలో పాల్గొన్న వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు
మల్హర్, అక్టోబర్ 9((చక్రవాణి న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్ల గ్రామంలోని శ్రీ సాయి వాణి విద్యానికేతన్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను శుక్రవారం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పూలతో బతుకమ్మలను అలంకరించి, పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.ఈ వేడుకల్లో వార్డు సభ్యులు కామ బాపు, తిర్రి అశోక్, పాఠశాల కరస్పాండెంట్ వీరంనేని సంపత్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
