తేదీ: --/--/----రోజు: --సమయం: --:--:--
BREAKING NEWS
తెలంగాణ తాజా వార్తలు • ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు • దేశవ్యాప్తంగా తాజా వార్తలు • మీ చక్రవాణి న్యూస్ • అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

తాడిచెర్ల ఓసీపీ ప్రాజెక్టు ప్రాంగణంలో మిన్నంటిన దసరా సంబరాలు

 హాజరైన ఏఎంఆర్ సీఎండీ మహేష్‌రెడ్డి కుటుంబ సభ్యులు

భారీ సంఖ్యలో పాల్గొన్న ఉద్యోగులు, పరిసర గ్రామాల ప్రజలు

మల్హర్, అక్టోబర్ 21 (చక్రవాణి న్యూస్): తాడిచెర్ల ఓసీపీ (ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్) ప్రాంగణంలో AMR సంస్థ ఆధ్వర్యంలో విజయదశమి (దసరా) వేడుకలు భక్తి శ్రధ్ధలతో సంప్రదాయబద్ధంగా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఏఎంఆర్ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ మహేష్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి రాక ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పండుగ సంబరాల్లో భాగంగా ఏఎంఆర్ ప్రాజెక్ట్ క్యాంప్ కార్యాలయ ఆవరణలో సంప్రదాయ ఆయుధ పూజలు, వాహన పూజలు, క్రమశిక్షణతో కూడిన దుర్గా మాత ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. అనంతరం వేడుకలకు విచ్చేసిన భక్తులు, కార్మికుల కోసం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అలాగే సామాజిక బాధ్యతలో భాగంగా స్థానిక పరిసర గ్రామాల మహిళలకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంఆర్ సంస్థ ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలకు, సంస్థకు మధ్య ఉన్న బలమైన సత్సంబంధాలను, ఐక్యతను ఈ విజయదశమి వేడుకలు మరోసారి ప్రతిబింబించాయి.హెచ్‌ఆర్ విభాగం మరియు ప్రాజెక్టు బృందాలు సంయుక్తంగా సమన్వయం చేసుకుంటూ, ఎక్కడా ఎటువంటి అంతరాయం కలగకుండా భద్రతా ప్రమాణాలతో వేడుకలను అత్యంత ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తి చేశాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన దసరా పండుగ, ఉద్యోగుల మరియు పరిసర గ్రామాల ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం, సరికొత్త అభివృద్ధిని తీసుకురావాలని ఏఎంఆర్ యాజమాన్యం ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది.

Name

MENU MENU

chakravani news chakravani news

SEARCH
Powered by Blogger.

Search This Blog

Life & style

Games

POLITICS$type=left$va=0$count=3

ARCHITECT$type=one$count=3


Gallery

Full width home advertisement

Author Description

Hey there! We are చక్రవాణి న్యూస్ — అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

/gi-fire/ YEAR POPULAR$type=one

Post Page Advertisement [Top]

Comments

Recent

Bottom Ad [Post Page]

Tags

Labels

Travel the world

Advertisement

Climb the mountains