తాడిచర్ల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు కేటాయించాలి
ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించిన తాడిచర్ల సర్పంచ్ బండి స్వామి
మల్హర్, అక్టోబర్ 26(చక్రవాణి న్యూస్) :మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామ అభివృద్ధికి AMR, TGGENCO సంస్థల ద్వారా సీఎస్ఆర్ నిధులు కేటాయించాలని సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సర్పంచ్ బండి స్వామి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేయడంతోపాటు, వ్యవసాయ రహదారులకు గ్రావెల్ వేయాలని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. సంబంధిత సంస్థల ద్వారా నిధులు మంజూరు చేసి గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
