భక్తిభావంతో అమ్మవారి సేవలో ఏఎంఆర్ సంస్థ!
తాడిచర్ల కోల్‌మైన్‌లో వైభవంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు
నాగులమ్మ ఆలయంలో అన్నదానం.. మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ
ఏఎంఆర్ సీఎండీ మహేష్‌రెడ్డి, రాధికారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
మల్హర్, అక్టోబర్ 19 (చక్రవాణి న్యూస్): ఆధ్యాత్మికతతో పాటు సేవాభావాన్ని చాటుతూ తాడిచర్ల కోల్ బ్లాక్-1 ఓపెన్‌కాస్ట్ మైన్‌లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు కార్మికులు, ఉద్యోగులు, పరిసర గ్రామాల ప్రజలందరికీ అందాలని ఆకాంక్షిస్తూ ఏఎంఆర్ కంపెనీ సీఎండీ మహేష్‌రెడ్డి, రాధికారెడ్డి దంపతులు ప్రతిరోజూ ప్రత్యేక అభిషేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు.
అమ్మవారి సన్నిధిలో అన్నదాన సేవ
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాగులమ్మ దేవాలయంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు, మైన్ కార్మికులకు అన్నప్రసాదాన్ని అందించారు. ఆధ్యాత్మిక వేడుకలకు సేవా కార్యక్రమాలను జోడిస్తూ స్థానిక మహిళలకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు. భక్తితో పాటు మానవతా విలువలను చాటేలా కార్యక్రమాలు సాగాయి.
కార్మికులు, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు
మైన్‌లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని, పరిసర గ్రామాల ప్రజల జీవితాల్లో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని మహేష్‌రెడ్డి, రాధికారెడ్డి దంపతులు అమ్మవారిని ప్రార్థించారు. ఉత్సవాలతో మైన్ ఆవరణలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమాల్లో ఏఎంఆర్ ప్రాజెక్ట్ హెడ్ ప్రభాకర్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కేఎస్ఎన్ మూర్తి, మైన్ మేనేజర్ జి. శ్రీనివాస్, సేఫ్టీ ఆఫీసర్ కె. సురేష్‌బాబు, జీఎం మెకానికల్ విశ్వప్రసాద్, కంపెనీ అధికారులు, సిబ్బంది, కార్మికులు, స్థానిక గ్రామాల భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

