తాడిచెర్ల ఓసిపి 1 లో ఘనంగా ఏఎంఆర్ ఆవిర్భావ వేడుకలు
ప్రాజెక్ట్ హెడ్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 34వ ఆవిర్భావ దినోత్సవం
మల్హర్, అక్టోబర్ 2 (చక్రవాణి న్యూస్) : ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ 34వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం తాడిచెర్ల-1 కోల్బ్లాక్లో ఘనంగా నిర్వహించారు. ప్రాజెక్ట్ హెడ్ (వైస్ ప్రెసిడెంట్) ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తొలుత సాయిబాబా విగ్రహానికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉద్యోగులు, కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఉద్యోగులు, కార్మికులకు సంస్థ తరఫున టీషర్ట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు, కార్మికులు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. సంస్థ అభివృద్ధిలో ఉద్యోగులు, కార్మికుల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు.కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కె.ఎస్.ఎన్. మూర్తి, మైన్ మేనేజర్ శ్రీనివాస్, సేఫ్టీ ఆఫీసర్ సురేష్ బాబు, జీఎం మెకానికల్ విశ్వ ప్రసాద్, హెచ్ఆర్ డీజీఎం రమేష్ బాబు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
