శాంతినగర్ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
జమ్ములమ్మ ఆలయం పక్కన బావిలో లభ్యం.. మృతుడి వివరాల కోసం పోలీసుల ఆరా
శాంతినగర్, అక్టోబర్ 9(చక్రవాణి న్యూస్): జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ పట్టణ శివారులోని జమ్ములమ్మ ఆలయం పక్కన ఉన్న బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సమాచారం. మృతుడి వయస్సు సుమారు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.మృతుడి పేరు, వివరాలు, స్వస్థలం ఇంకా తెలియరాలేదు. మృతుడిని గుర్తించేందుకు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు లేదా ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచారం ఉన్నవారు శాంతినగర్ పోలీసులను సంప్రదించాలని కోరారు.
సమాచారం ఇవ్వాల్సిన ఫోన్ నంబర్: 8712670290
మృతుడి గుర్తింపు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
