మృతురాలి కుటుంబానికి అండగా రుద్రారం సర్పంచ్ సంపత్
మల్హర్, అక్టోబర్ 16(చక్రవాణి న్యూస్) : మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన గోసిక లక్ష్మి ఇటివల మృతి చెందగా మృతురాలి కుటుంబాన్ని శుక్రవారం స్థానిక రుద్రారం సర్పంచ్ చంద్రగిరి సంపత్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారి కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు గాదే గట్టయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.
